వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి యేడాది కూడా పూర్తికాకముందే ప్రతిపక్ష తెలుగుదేశం వైసీపీపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరుగుతోంది. ఇందుకు జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న చారిత్రాత్మక నిర్ణయాలు కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ కారణాలను ఎదుర్కొనేందుకు ప్రభత్వం కూడా ఒకింత దూకుడుగానే ప్రవర్తిస్తున్నట్టు స్పష్టమవుతోంది. వీటికితోడు వైసీపీ ప్రభుత్వం కూడా తెలుగుదేశం పార్టీ ఆర్ధికమూలాలపై దెబ్బ కొడుతూ పరిపాలన సాగిస్తూ ముందుకెళ్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈనేపధ్యంలో వైసీపీ పై టీడీపీ కూడా ఏమాత్రం తగ్గకుండా రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తోంది. విమర్శల విషయంలోనూ ఏమాత్రం తగ్గడం లేదు. కొన్నిసార్లు గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నపుడు వైసీపీ పై మైండ్ గేమ్ ఆడినట్టుగా ఇప్పుడు కూడా ఆ పంధాను ఉపయోగించి ముందుకెళ్లాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నా ఆ ప్రయత్పాలు ఏమాత్రం ఫలించడం లేదు. ఎందుకంటే వైసీపీ ఎత్తుకు పై ఎత్తులు వేస్తెోంది. కేంద్రప్రభుత్వ అధీనంలో ఉంటూ, స్వయం స్వేచ్ఛ కలిగిన ఐటీ దాడుల విషయంలో మాత్రం టీడీపీ, అనుకూల మీడియా కనీసం కిమ్మనడం లేదు.