వైసీపీ సీనియర్ నేత ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా రాధాకృష్ణపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. “ఎకనమిక్ టైమ్స్ ఏదో రాసిందని కిరసనాయిలు తెగ మురిసిపోతున్నాడు. అంతర్జాతీయ మీడియాను మ్యానేజ్ చేసినోళ్లకు దేశీయ పత్రికలు ఒక లెక్కా. సంపాదించిన లక్షల కోట్లలో ఉల్లి పొరంత ఖర్చుపెడితే నిత్యం ఏదో కుట్రను ప్రచారంలో పెట్టొచ్చు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ సర్వైవల్ సీక్రెట్ ఇదే కదా!” అని అన్నారు. ప్రస్తుతం చంద్రబాబు వైసీపీపై ఎలాగైనా కుట్రలు చెయ్యాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రతీఒక్కరిని భరిలోకి దింపుతున్నాడు. మరోపక్క బాబు అనుకూల మీడియాతో ఏవేవో తప్పుడు వార్తలు రాయించి ప్రజల్లోకి వెళ్ళేలా చేస్తున్నాడు. కాని ప్రజలు వాటికి నమ్మడం లేదనే చెప్పాలి.