విద్యార్థిని సుగాలి ప్రీతి అత్యాచారం, హత్య ఘటనకు పాల్పడ్డ నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఈ నెల 12 న కర్నూలులో ర్యాలీ చేపట్టి, బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గం.కు రాజ్ విహార్ కూడలి నుంచి కోట్ల కూడలి వరకూ ర్యాలీ నిర్వహిస్తారు. ఈ ర్యాలీలోజనసేన నాయకులూ, శ్రేణులు, వివిధ ప్రజా సంఘాలు పాల్గొంటాయి. అనంతరంకోట్ల కూడలిలో బహిరంగ సభ నిర్వహిస్తారు.13 వ తేదీ ఉదయం నుంచి సాయంత్రం వరకూ కర్నూలు,ఎమ్మిగనూరులోనిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొని ప్రజా సమస్యలను తెలుసుకొనేందుకు క్షేత్ర స్థాయి పర్యటనలు చేపడతారు.