న్యూజిలాండ్ టూర్ అనగానే అందరికి ఎక్కడో ఒక్క అనుమానం. మొదట టీ20 సిరీస్ జగరనుంది కాబట్టి అందులోను కివీస్ తో టీ20 మ్యాచ్ లో ఇప్పటివరకు అంతగా విన్నింగ్ శాతం లేకపోవడంతో కచ్చితంగా ఓడిపోతారు అని అనుకున్నారు. కాని 5మ్యాచ్ లు గెలిచి సిరీస్ ని గెలిచి క్లీన్ స్వీప్ చేయడంతో అందరి అంచనాలు తారుమారు అయ్యాయి. అటు బౌలింగ్, ఇటు బ్యాట్టింగ్ అలా అన్ని విభాగాల్లో పర్ఫెక్ట్ అనిపించింది. దాంతో వన్డే సిరీస్ ను చాలా తేలిగ్గా తీసుకుంది. దాని ఫలితమే ఈరోజు వన్డే సిరీస్ ని దారుణంగా ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండా ఓడిపోయింది. మరి దీనికి కెప్టెన్ కోహ్లి భాద్యత వహించి ఏం చెబుతాడో వేచి చూడాలి.