వైసీపీ సీనియర్ నేత ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి ట్విట్టర్ వేదికగా టీడీపీపై మండిపడ్డారు. ఇక టీడీపీ విషయానికి వస్తే ఏదైనా ప్రారంభించడం పాపం వెంటనే దానిని అణగదొక్కడానికి ప్రయత్నాలు చేస్తారు. ఇలా ప్రతీవిషయంలో ప్రజలకు మేలు జరుగుతుందా లేదా అని చూడకుండా వారు ప్రవతిస్తున్నారు. ఇక కరెంటు బిల్లు విషయానికి వస్తే “ఈఆర్సీ ప్రకటించిన కరెంట్ ఛార్జీల టారిఫ్‌ను లోతుగా పరిశీలించకుండానే వడ్డింపు, వాయింపు, బాదుడు అంటూ ఎల్లో మీడియా ఏడుపు మొదలెట్టింది. కొత్త టారిఫ్‌తో కోటీ 43 లక్షల మంది వినియోగదారులకు 60 కోట్ల వరకు భారం తగ్గుతుందన్న వాస్తవాన్ని కప్పిపెట్టి దుష్ప్రచారానికి తెర తీసింది” అని విజయసి రెడ్డి అన్నారు.