ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి అధికార, పరిపాలనా వికేంద్రీకరణకు దిశగా రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటుకు ముందడుగు వేస్తున్న సంగతి తెలిసిందే. అమరావతిని లెజిస్టేటివ్ క్యాపిటల్‌గా కొనసాగిస్తూనే…విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, కర్నూలులో జ్యుడిషియల్ క్యాపిటల్ ఏర్పాటు చేస్తూ తీర్మానాన్ని అసెంబ్లీలో ఆమోదించారు. అయితే మూడు రాజధానుల బిల్లును శాసనమండలిలో టీడీపీ అధినేత చంద్రబాబు నిబంధనలకు వ్యతిరేకంగా స్పీకర్‌ను ప్రభావితం చేసి సెలెక్ట్ కమిటీకి పంపేలా చేశాడు. దీంతో ఆగ్రహించిన సీఎం జగన్ ఏకంగా శాసనమండలిని రద్దు చేస్తూ తీర్మానాన్ని అసెంబ్లీలో ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. అయితేమూడు రాజధానులకు వ్యతిరేకంగా గత రెండు నెలలుగా అమరావతి ప్రాంత రైతులు టీడీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. చంద్రబాబు అమరావతి జేఏసీ ఏర్పాటు చేసి భిక్షాటన చేస్తూ..రైతులను రెచ్చగొడుతూ ఎంతగా ప్రయత్నించినా.. ప్రభుత్వం మాత్రం వెనకడుగు వేయడం లేదు.. విశాఖ, కర్నూలులో రాజధానులను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇక దాదాపు రెండు నెలలుగా అమరావతిలో ఆందోళనలు జరుగుతున్నా…బొత్స, పేర్నినాని, కొడాలి నాని, బుగ్గన వంటి మంత్రులు, ఎమ్మెల్యేలతో మాట్లాడిస్తున్నారే కాని.. సీఎం జగన్ పెద్దగా స్పందించలేదు. ఇటీవల మంగళిగిరి ఎమ్మెల్యే ఆర్కే ఆధ్వర్యంలో కొంతమంది అమరావతి గ్రామాల రైతులు సీఎం జగన్‌ను కలవడం మినహా…అమరావతి ఆందోళనపై ప్రత్యక్షంగా సీఎం జగన్ మాట్లాడలేదు.
అయితే తాజాగా సీఎం జగన్ జాతీయమీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నవ్యాంధ్ర రాజధాని అమరావతి గురించి కీలక వ్యాఖ్యలు చేశారు…అమరావతి ఇప్పటికీ గ్రామమేనని సీఎం తేల్చి చెప్పారు. అమరావతి ఇతర రాష్ట్రాల్లోని రాజధాని నగరాలకు ధీటుగా నిలవాలంటే కొన్ని దశాబ్దాలు పడుతుందని సీఎం జగన్ తెలిపారు. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ లాంటి నగరాలకు పోటీగా నిలవాలంటే ఇప్పటికే అభివృద్ధి చెందిన విశాఖపట్నం అయితేనే రాజధానికి అనువైందని అన్నారు. పదేళ్లలో విశాఖను ఈ మూడు రాజధాని నగరాలకు ధీటుగా అభివృద్ధి చేసుకోవచ్చని సీఎం వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు. అమరావతి అభివృద్ధి చెంది రాజధాని నగరంగా రూపుదిద్దుకోవడానికి 50ఏళ్లకు పైగానే పడుతుందని.. అప్పటివరకూ ఏపీ యువత ఉద్యోగాల కోసం ఇతర నగరాలకు వలస వెళ్లాల్సి వస్తుందని సీఎం జగన్ చెప్పుకొచ్చారు.
కాగా సీఎం జగన్ వ్యాఖ్యలలో వాస్తవం ఉంది. గత ఐదేళ్లు అమరావతిలో రెండు, మూడు తాత్కాలిక భవనాలు తప్పా..పెద్దగా డెవలప్ జరుగలేదు..కనీసం అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్డును కూడా బాబు కట్టించలేకపోయాడు.,,ఇప్పటికీ అమరావతిలో ఎక్కువ శాతం మట్టిరోడ్లే ఉన్నాయి. ఈ లెక్కన చంద్రబాబు గ్రాఫిక్స్ చూపిస్తే..సీఎం జగన్ మాత్రం వాస్తవం మాట్లాడుతున్నారు..నిజమే అమరావతి ఇప్పటికీ గ్రామమే..ఆ గ్రామం అంతర్జాతీయ స్థాయి నగరంగా రూపుదిద్దుకోవాలంటే కనీసం 50 ఏళ్లు పడుతుంది. అదే వైజాగ్, కర్నూలును రాజధానులుగా డెవలప్ చేస్తే..అధికార, పరిపాలనా వికేంద్రీకరణ జరిగి అన్ని ప్రాంతాలు సమానంగా డెవలప్ అవుతాయి..ఇదీ సీఎం జగన్‌కు ఉన్న ముందు చూపు…మొత్తంగా అమరావతి గురించి జాతీయ మీడియాతో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనం రేపుతున్నాయి.