తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సారధి, బంగారు తెలంగాణ నిర్మాత ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఫిబ్రవరి 17న ప్రతి ఒక్కరం కనీసం ఒక మొక్కను నాటి సంరక్షించడం ద్వారా ఆయనకు అపురూపమైన కానుక ఇవ్వాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రాష్ట్ర ప్రజలను కోరారు.
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు హరితహారం యజ్ఞంలో అందరం భాగస్వాములం కావాలని విజ్ఞప్తి చేశారు. సాధారణ ప్రజలతోపాటు వార్డు మెంబర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, జెడ్పీ చైర్ పర్సన్లు, స్థానిక సంస్థల కో ఆప్షన్ మెంబర్లు స్వయంగా మొక్కను నాటి వాటి సంరక్షణ బాధ్యతలు చేపట్టాలని కోరారు.
అలాగే పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, డీఎల్ఫీవోలు, డీపీపీవోలు, జెడ్పీ సీఈవోలు… మిషన్ భగీరథ, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగంలోని అధికారులు, సిబ్బంది అంతా తల ఒక మొక్కను నాటాలని మంత్రి దయాకర్ రావు విజ్ఞప్తి చేశారు. ఐకేపీ, మహిళా సంఘాలు కూడా పాల్గొనాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విజ్ఞప్తి చేశారు.