ఒకప్పుడు ఐరన్ లెగ్ గా భావించిన పూజా హెగ్డే ప్రస్తుతం గోల్డెన్ లెగ్ గా మారింది. వరుస సినిమాలు చేస్తూ హిట్ లు కొడుతూ మంచి పేరు తెచ్చుకుంటుంది. ఈతరం హీరోలకు తగ్గట్టుగా మంచి హైట్ అండ్ పర్సనాలిటీ తో దర్శకనిర్మాతలను ఆకర్షించుకుంటుంది. సినిమాల పరంగా కాకుండా ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఒక లవ్ ఎఫైర్ విషయంలో వార్తల్లో నిలిచింది.ఒక బడా హీరో కుమారుడితో లవ్ లో ఉన్నట్టు ప్రస్తుతం డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు బాగా వినిపిస్తున్నాయి. ఆయన మరెవరో కాదు బాలీవుడ్ పాపులర్ సీనియర్ స్టార్ వినోద్ మెహ్రా కుమారుడు రోహన్ వినోద్ మెహ్రానే. అతడితో పూజా ప్రేమలో పడినట్టు సినీ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి.