తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి,అధికార టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఆ పార్టీ శ్రేణులకు,ముఖ్యమంత్రి కేసీఆర్ అభిమానులకు పిలుపునిచ్చారు.
ఈ నెల పదిహేడో తారీఖున ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఆ రోజు ప్రతి ఒక్కరూ కనీసం ఒక్కో మొక్క నాటుదాం అని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్‌కు హరితహారం అంటే ఎంత ఇష్టమో మనకు తెలుసు.
సీఎం కేసీఆర్ పుట్టినరోజున ఈచ్ వన్ ప్లాంట్ వన్ నినాదంతో మొక్కలు నాటుదామని ఆయన ట్విట్టర్లో పోస్టు చేశారు. ఈ నెల 17న ముఖ్యమంత్రి కేసీఆర్ 66వ వసంతంలోకి అడుగుపెట్టబోతున్నారని కేటీఆర్ ట్వీట్ చేశారు.