ఈటీవీలో ప్రతి గురువారం ప్రసారమయ్యే జబర్దస్త్ ప్రోగ్రాంతో అందరికి సుపరిచితమైన హాట్ యాంకర్ అనసూయ. పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్న కానీ యాంకరింగ్లో అందాలను ఆరబోయడంలో ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు.
అప్పుడప్పుడు సినిమాల్లో కూడా అందాలను ఆరబోస్తూ.. చక్కని ప్రాధాన్యమున్న సినిమాల్లో కూడా నటిస్తుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ వేధింపులకు గురవుతున్నట్లు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేసింది.
సోషల్ మీడియాలో గత కొంతకాలంగా కొంతమంది తనను అసభ్య పదజాలంతో దూషిస్తున్నారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆమె పోలీసులకు పిర్యాదు చేయడంతో కేసును నమోదు చేసుకుని దర్యాప్తుకు సిద్ధమవుతున్నారు.