ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ వేదికగా మూడు రాజధానులు గురించి ప్రతిపాదించిన విషయం తెలిసిందే. దాంతో ఒక్కసారిగా కంగుతున్న టీడీపీ నేతలు షాక్ కి గుర్రయ్యారు. అదేగాని జరిగితే టీడీపీ ఇప్పటివరకు దాచుకున్న ఆస్తులు మొత్తం అస్సాం అవుతాయని అనుకున్నారో ఏమో మరి ఒక్కసారిగా గేమ్ స్టార్ట్ చేసారు. వారి అనుకులా మీడియాతో ఏవేవో కట్టుకధలు అల్లించి తప్పుదోవ పట్టించాలని చూసారు. వారు ఎన్ని చేసిన ప్రజలు నమ్మే స్థితిలో లేరని వారికి అర్దంకాలేదు. ఇక మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే గత 50 రోజులుగా అమరావతి రైతులను రెచ్చగొడుతూ ఆందోళనలు చేయిస్తున్నారు. అయితే ఈ విషయంపై ట్విట్టర్ వేదికగా స్పందించిన విజయసాయి రెడ్డి “రాజధానిపై కేంద్రం జోక్యం చేసుకోదని పార్లమెంటులో సంబంధిత మంత్రి వెల్లడించారు. అది రాష్ట్రాలకున్న ప్రత్యేక హక్కు. ఎల్లో మీడియా మాత్రం కేంద్రం ఎలాగైనా అడ్డుకోవాలని కోరుకుంటోంది. దీనిపై వివరణ ఇచ్చిన బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ గారిపై దుష్ప్రచానికి ఒడిగట్టడం దారుణం” అని అన్నారు.
