వర్థన్నపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ ఎన్నికలలో గులాబీ జెండా ఎగురవేయాలని వర్థన్నపేట ఎమ్మెల్యే శ్రీ అరూరి రమేష్ గారు పిలుపునిచ్చారు. వర్ధన్నపేట మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వర్ధన్నపేట పీఏసీఎస్ ఎన్నికలల్లో పోటీచేసే అభ్యర్ధులు, మండల ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులతో ఎమ్మెల్యే ఆరూరు రమేష్ గారు సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వర్థన్నపేటలోని సహకార సోసైటీలో అన్నింటిని ఏకగ్రీవం అయ్యేవిధంగా చూడాలని, ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ విజయానికి కార్యకర్తలంతా సమిష్టిగా కృషి చేయాలన్నారు. వర్ధన్నపేట పీఏసీఎస్ లోని 13 వార్డుల్లో అన్ని వార్డుల్లో విజయం సాధించి టిఆర్ఎస్ సత్తా ఏంటో చూపించాలని ముఖ్య నాయకులకు సూచించారు . పార్టీ నిర్ణయానికి కట్టుబడి పనిచేయాలని కోరారు.
పార్టీ నిర్ణయానుసారం ఎవరికి టికెట్ ఇచ్చినా అందరు కలిసి పనిచేసి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలన్నారు. రైతు సంక్షేమం కోసం తెరాస ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించి రైతులను చైతన్య వంతులను చేయాలని తెలిపారు . ఈ కార్యక్రమం లో ఎంపిపి అన్నమనేని అప్పారావు , జడ్పిటిసి మార్గం బిక్షపతి , మండల పార్థీ అధ్యక్షులు తూల్ల కుమారస్వామి, మండల ప్రజా ప్రతినిధులు, ముఖ్యనాయకులు తదితరులు పాల్గొన్నారు.