తెలంగాణ రాష్ట్రంలో 55 గ్రామీణ న్యాయాలయాల ఏర్పాటుకు మార్గం సుగమం అయింది. గ్రామ న్యాయాలయాల చట్టం- 2008 ప్రకారం 55 గ్రామ న్యాయాలయాల ఏర్పాటుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పాలనాఅనుమతులిచ్చింది.
ఇందులోభాగంగా 55 మంది జూనియర్ సివిల్ జడ్జిస్థాయి జుడిషియల్ అధికారులను గ్రామ న్యాయాధికారిగా నియమిస్తారు. కోర్టుల నిర్వహణకు 220 మంది హెడ్క్లర్కులు, జూనియర్ అసిస్టెంట్లు, స్టెనోగ్రాఫర్లు, అటెండర్లను కాంట్రాక్టు పద్ధతిలో నియమిస్తారు.
ఈ మేరకు నూతన పోస్టుల మంజూరుకు అనుమతిస్తూ ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి కే రామకృష్ణారావు ఉత్తర్వులు జారీచేశారు.