మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తన గొప్ప మనస్సును చాటుకున్నారు. తన అభిమానికిచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. సరిగ్గా నెల క్రితం మెగాస్ట్రార్ చిరంజీవి ఆభిమాని..గ్రేటర్ హైదరాబాద్ సిటీ చిరంజీవి యూత్ ఫ్యాన్స్ అధ్య్క్షుడు నూర్ మహమ్మద్ గుండెపోటుతో చనిపోయారు. మహమ్మద్ మరణ వార్త తెలుస్కున్న చిరంజీవి సికింద్రాబాద్ లో మహమ్మద్ ఇంటికి స్వయంగా వెళ్ళి ఆయన కుటుంబ సభ్యులను పరమార్శించి.. అన్ని విధాలుగా అండగా ఉంటానని భరోసానిచ్చాడు. తాజాగా రామ్ చరణ్ తేజ్ మహమ్మద్ కుటుంబ సభ్యులకు రూ. పది లక్షలు విరాళంగా ఇచ్చారు.మహమ్మద్ మరణించిన సమయంలో విదేశాల్లో ఉన్న రామ్ చరణ్.. హైదరాబాద్ రాగానే నూర్ మహమ్మద్ కుటుంబాన్ని కలుస్తానని చెప్పారు. వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఇచ్చిన మాటను చరణ్ నిలుపుకుని ఈ రోజు ఆదివారంఉదయం నూర్ మహమ్మద్ కుటుంబసభ్యులను తన ఇంటికి పిలిపించుకుని రూ.10 లక్షల చెక్కుని వారికిచ్చారు.
Mega powerstar #RamCharan hand overs 10L cheque to Mega fan #Noor family.? pic.twitter.com/wtx79vaYi0
— Suresh Kondi (@V6_Suresh) February 9, 2020