ఒకరేమో దాదాపు పదేళ్ల పాటు అనేక అవమానాలు.. హేళనలు.. కష్టాలను ఎదురర్కుని .. ముఖ్యమంత్రి అయిన విశేష ఆదరణ ఉన్న యువనేత.. మరోకరేమో సినిమాల్లో తన నటనతో.. స్టైల్స్ తో తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాదు యావత్తు ప్రపంచమంతా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న స్టార్ హీరో.. వారే ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి.. మరోకరు సూపర్ స్టార్ రజనీకాంత్.
అయితే సరిగ్గా రెండేళ్ల కిందట అంటే 2017 డిసెంబరు 31న రాజకీయాలపై ప్రకటన చేసినప్పటికీ రజనీ కాంత్ అధికారకంగా ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొనలేదు. వీటన్నిటికీ రజనీకాంత్ శుభకార్డు పలికి. సరికొత్త సంచలన నిర్ణయం తీసుకున్నారని తమిళ రాజకీయాల్లో వినిపిస్తున్నాయి.
ఇందులో భాగంగా గత సార్వత్రిక ఎన్నికల ముందు ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి పాదయాత్ర చేసినట్లు రజనీ కాంత్ కూడా ఏఫ్రిల్ పద్నాలుగో తారీఖు నుండి పాదయాత్ర చేయనున్నట్లు యవత్తు తమిళ ఇండస్ట్రీ వర్గాల టాక్. దాదాపు అరవై తొమ్మిదేళ్ల వయస్సున్న రజనీకాంత్ పాదయాత్ర చేస్తే దేశంలోనే మరో సంచలనమవుతుందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.