హైదరాబాద్ లోని ఎర్రగడ్డ గోకుల్ సినిమా థియేటర్‌లో జాను సినిమా చూస్తూ ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. ఎస్ ఆర్ నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం జాను సినిమా విడుదల కావడంతో మ్యాట్నిషో చూసేందుకు ఓ వ్యక్తి థియేటర్‌కు వచ్చాడు. సినిమా అయిపోయాక ప్రేక్షకులందరు వెళ్లిపోయినా అతడు సీట్లో నుండి లేవకపోవడాన్ని గమనించిన సిబ్బంది అతని దగ్గరకు వెళ్లి లేపేందుకు ప్రయత్నించారు. అప్పటికే మృతిచెందినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. థియేటర్‌కు వచ్చిన ఎస్‌ఐ మహేందర్ అతని మృతదేహన్ని స్వాధీనం చేసుకుని గాంధీ మార్చురీకి తరలించారు. అతడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో గుర్తు లియని వ్యక్తి మృతిగా కేసు నమోదుచేశారు. గుండెపోటుతో మృతి చెందాడా లేక ఇతర కారణాలు ఏమైనాఉన్నాయా అన్న కోణంలో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ తెలిపారు. సినిమా చూస్తూ భావోద్వేగానికి లోనై చనిపోయి ఉంటాడని అక్కడివారు చెప్తున్నారు.
