Home / ANDHRAPRADESH / గల్లాజయ్‌దేవ్‌‌పై అదిరిపోయే సెటైర్ వేసిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి..!

గల్లాజయ్‌దేవ్‌‌పై అదిరిపోయే సెటైర్ వేసిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి..!

ఏపీ నుంచి కియా పరిశ్రమ తమిళనాడుకు తరలిపోతుందంటూ ఆంగ్ల న్యూస్ ఏజెన్సీ రాయటర్స్ రాసిన కథనంపై టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన అను”కుల” మీడియా రెండు రోజుల పాటు పండుగ చేసుకుంది. కియా తరలింపు వార్తలపై ఏపీ ప్రభుత్వంతో పాటు, కియా పరిశ్రమ ప్రతినిధులు కూడా తక్షణమే స్పందించారు. ఏపీ నుంచి పరిశ్రమ తరలిపోతుందంటూ మీడియాలో వస్తున్న వార్తలు నిరాధారమని, కియా ప్లాంట్‌ను తమిళనాడుకు తరలించడం లేదని..ఏపీలోనే మరింతగా విస్తరణకు ప్రయత్నిస్తున్నామని కియా కంపెనీ ప్రతినిధులు మీడియా ముందుకు వచ్చి మరీ స్పష్టం చేశారు.

అయితే కియా తరలించడం లేదని అటు ప్రభుత్వం..ఇటు కియా మేనేజ్‌మెంట్ క్లారిటీ ఇచ్చినా.. చంద్రబాబుతో సహా టీడీపీ నేతలంతా ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు. నేను కష్టపడి తీసుకువచ్చిన పరిశ్రమను పక్క రాష్ట్రాలకు తరలిపోయేలా చూస్తారా..కియా మోటార్స్ అధికారులను వైసీపీ నేతలు కమీషన్ల కోసం బెదిరిస్తే..ఇక ఏపీకి పెట్టుబడులు పెట్టడానికి ఎవరు వస్తారంటూ చంద్రబాబు అడ్డగోలుగా విమర్శలు చేశారు. అంతే కాదు..ఒక పక్క కియా సంస్థ, తమిళనాడు ప్రభుత్వం ఈ తరలింపు అవాస్తం అంటున్నా…చంద్రబాబు ఆదేశాల మేరకు టీడీపీ ఎంపీలు పార్లమెంట్‌లో రెచ్చిపోయారు. వైసీపీ ప్రభుత్వ వ్యవహర శైలి కారణంగానే కియావంటి కీలక పరిశ్రమలు తరలిపోతున్నాయని, తక్షణం కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని టీడీపీ ఎంపీలు రామ్మోహన్ నాయుడు, గల్లాజయ్‌దేవ్‌లు పార్లమెంట్‌లో డిమాండ్ చేశారు. కాగా గల్లాజయ్‌దేవ్‌కు లోకసభ స్పీకర్ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు. అది ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన విషయం…కియా పార్లమెంట్ తరలింపు విషయాన్ని ఏపీ ప్రభుత్వం ప్రకటించలేదు..ఎందుకు ఇక్కడ గోల చేస్తున్నారని స్పీకర్ గల్లాకు క్లాస్ పీకారు.

అయినా గల్లా ఈ విషయాన్ని వదల్లేదు..ట్విట్టర్ వేదికగా మరోసారి రచ్చచేశారు. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ కియా ప్రతినిధులను బెదిరిస్తున్నట్లు ఓ పిక్ పోస్ట్ చేసి….కియా తరలింపుపై ఎవరు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారో..ఈ పిక్ చూసి మీరే డిసైడ్ చేయండి అంటూ…ట్వీట్ చేశారు. కాగా ఈ ట్వీట్‌కు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు. బాధ్యత గల ఎంపీ స్థానంలో ఉండి ఇలాంటి అవాస్తవాలను ఎందుకు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కియా మోటార్స్‌ రాష్ట్రంలోనే ఉంటుందని ఆ సంస్థ ఎండీ స్పష్టం చేసిన విషయాన్ని ట్విటర్‌ వేదికగా జయదేవ్‌కు గుర్తుచేస్తూ… ‘‘నీ తలపై జుట్టు మాత్రమే లేదనుకున్నాను. కానీ బుర్ర కూడా లేదని ఇప్పుడే అర్థమైంది. ఏపీలో ఉన్న పెట్టుబడిదారులను తరిమేయాలని ఎందుకంత తొందర మీకు?  ఎవరు బాధ్యతరాహిత్యంతో ప్రవర్తిస్తున్నారో ఇప్పటికైనా అర్థమైందా… కియా మోటార్స్‌ రాష్ట్రం నుంచి తరలిపోవడం లేదని ఆ సంస్థ సమాధానం ఇచ్చింది. ఒక ఎంపీగా ఉండి అసత్యాలు ప్రచారం చేస్తావా? అయినా నీ నుంచి ఇంతకన్నా ఎక్కువ ఏం ఆశించగలం’’ అని మిథున్‌రెడ్డి రీ ట్వీట్ చేశారు. మొత్తంగా కియా తరలింపుపై టీడీపీ ఎంపీ గల్లాజయ్‌దేవ్ చేసిన అసత్య ప్రచారానికి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుతం వీరిద్దరి మధ్య జరిగిన ట్విట్టర్ వార్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat