Home / SLIDER / శభాష్ తెలంగాణ పోలీస్

శభాష్ తెలంగాణ పోలీస్

దాదాపు కోటిన్నర మంది భక్తులు హాజరైన మేడారం జాతరలో ఏ విధమైన తొక్కిసలాటలు, అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా నివారణకు గాను తొలిసారిగా పోలీస్ శాఖ ఉపయోగించిన కృత్రిమ మేధో సాంకేతిక పరిజ్ఞానం పూర్తి స్థాయిలో విజయవంతం అయింది. మేడారం లో ప్రధానంగా సమ్మక్క, సారలమ్మ గద్దెలను ప్రతి ఒక్క భక్తుడు సందర్శించి మొక్కులు సమర్పించే సందర్భం యంత్రాంగానికి ప్రతీ జాతరలోనూ ప్రధాన సవాలుగా ఉంటోంది. ఈసారి జాతర లో ఏ చిన్న సంఘటన లేకుండా నిర్వహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో మేడారం లో ఆధునిక పరిజ్ఞానం పూర్తి స్థాయిలో ఉపయోగించాలని డీజీపీ మహేందర్ రెడ్డి నిర్ణయించారు. దీనితో, ప్రపంచం లోనే అత్యధిక సంఖ్యలో జనాలు హాజరయ్యే ప్రయోగరాజ్ కుంభ మేళాలో అక్కడి పాలనా యంత్రాంగం కోట్లాది మంది భక్తులు ప్రశాంతంగా గంగలో పుణ్యస్నానాలు ఆచరించే విదంగా చేపట్టిన చర్యలను పరిశీలించాలని సీనియర్ అధికారులను ముఖ్యంగా ఐటీ విభాగానికి డీజీపీ సూచించారు.

దీనితో, ప్రయాగ లో జన నియంత్రణకు ఉపయోగించిన ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ పరిజ్ఞానాన్ని ఐటీ విభాగం అధికారులు దాదాపు ఆరు నెలలు అధ్యయనం చేశారు. కుంభమేళాలో ఉపయోగించిన మౌలిక సాంకేతిక విధానాన్నే మేడారంలో ఉపయోగించారు. అయితే, కుంభ మేళాకు వచ్చే భక్తులలో ప్రధానంగా పట్టణ ప్రాంతవాసులు, ఎగువ మధ్యతరగతి వారు హాజరవుతారు. మేడారం లో మాత్రం అత్యధికంగా గిరిజనులు. గ్రామీణ ప్రాంతం వారు తొంబై శాతం హాజరవుతారు. ఈ నేపథ్యంలో మేడారంలో అక్కడ ఉపయోగించిన సాంకేతికత కు స్థానిక అనుభవాలను అనుసంధానించారు. గద్దెల వద్దకు దారితీసే జంపన్న వాగు నుండి వచ్చే దారి, ఆర్టీసీ బస్టాండ్, ఊరట్టం మార్గాలనుండి వచ్చే భక్తుల సంఖ్యలో ను ఎప్పటికప్పుడు అంచనా వేయడానికి 14 ఆర్టిఫిషల్ హైడెఫినెషన్ కెమెరాలను అమర్చారు. ఈ కెమెరాలను మేడారం పోలీస్ క్యాంప్ లో ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ రూమ్ కు అనుసందానం చేశారు. ఇక్కడినుండి కృత్రిమ మేధో సాంకేతిక పరిజ్ఞానంతో భక్తులు వచ్చే సంఖ్యను అంచనా వేసి ఏ ప్రాంతo లో క్రౌడ్ ను అదుపు చేసే విధంగా ఏప్పటికప్పుడు సూచనలను కంట్రోల్ రూమ్ ద్వారా అందించారు.

ప్రధానంగా ఒక చదరపు మీటర్ లో 3.6 మంది భక్తులు మించగానే ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ అప్రమత్తం చేస్తుంది. దీనితో తొక్కిసలాటకు ఆస్కారం లేకుండా తగు చర్యలు చేపట్టడం ఇలా సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవడం ద్వారా మేడారం జాతరను ప్రశాంతంగా నిర్వహించడంలో పోలీస్ శాఖ విజయవంతం అయింది. జాతర నిర్వహణ పై గతంలో ఎప్పుడు లేని విధంగా డీజీపీ మహేందర్ రెడ్డి మేడారంలో రెండుసార్లు పర్యటించారు. మొత్తానికి మేడారం లో తొలిసారిగా ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స తొలిసారిగా సాంకేతిక విధానాన్ని ఉపయోగించి సంఘటనల రహిత జాతరగా నిర్వహించిన అనుభవాన్ని రానున్న కాలం లో జరుగనున్న భారీ సభలు, సమావేశాలు, ర్యాలీల సందర్భాల్లో వినియోగించుకుంటామని సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat