జబర్దస్త్ కామెడీ షో విషయంలో రోజురోజుకి వ్యవహారం వేడెక్కుతుంది. నాగబాబు, మల్లెమాల మధ్య విబేధాలు రావడంతో ఆయన షో ని వదిలేసి బయటకు వచ్చేసారు. ఇప్పుడు అదిరింది, లోకల్ గ్యాంగ్స్ షో లలో నటిస్తున్నారు. నాగబాబు జబర్దస్త్ ను వదిలేసినప్పటికీ అందులో జరిగే స్కిట్స్ లో మాత్రం ఆయనను వదలడం లేదు. అయితే ప్రస్తుతం అదిరింది షో లో జబర్దస్త్ పై పంచ్ లు వేస్తూ వస్తున్నారు. దీంతో మండిపడుతున్న మల్లెమాల కూడా అలాంటిదే చెయ్యాలని చూస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ షో లో హైపర్ ఆదీ మాత్రం అదిరింది, నాగబాబుకు సందు దొరికినప్పుడల్లా పంచ్ లు వేస్తూ ఆడుకుంటున్నాడు. ఈ పంచ్ లకురోజు పడిపడి నవ్వుకుంటున్నారు.