తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మొత్తం ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ఖరారు చేస్తూ విడుదల చేసింది. ఇందులో కొత్త ఓటర్ల మార్పులు,చేర్పులు ,కొన్ని తీసివేతల తర్వాత తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ జాబితాను విడుదల చేసింది.
మొత్తం నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో 2,99,32,943మంది ఓటర్లు ఉన్నారని తేలింది. ఇందులో పురుషుల ఓటర్ల సంఖ్య 1,50,41,943.. మహిళల ఓటర్ల సంఖ్య 1,48,89,410.. ఇతరులు 1590 ఉన్నారని ఎన్నికల సంఘం తెలిపింది.
కొత్తగా నమోదైన ఓటర్లు 1,44,855మంది ఉన్నారు. సర్వీస్ ఓటర్లు 12,639మంది ఉన్నారని ఎన్నికల సంఘం పేర్కొంది.