పోలీసులు 24 గంటలూ అందుబాటులో దిశ కంట్రోల్ రూమ్ ఉండేలా ప్రత్యేక యాప్ ను ప్రారంభించనున్నారు. రాజమహేంద్రవరంలో ‘దిశ’ మహిళా పోలీస్ స్టేషన్ ని సీఎం జగన్ ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో హోం మంత్రి మేకతోటి సుచరిత, పలువురు మహిళా మంత్రులు, ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా, డీజీపీ గౌతం సవాంగ్ తదితరులు పాల్గొన్నారు. 24 గంటల పాటు దిశ కంట్రోల్ రూమ్ అందుబాటులో ఉండనుంది. దిశ చట్టానికి సంబంధించి ప్రత్యేక యాప్ ను జగన్ ప్రారంభించనున్నారు.
