గత రెండురోజులుగా చంద్రబాబు మాజీ పర్సనల్ సెక్రటరీ శ్రీనివాసరావుకు చెందిన ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. దాంతో టీడీపీ నేతలనుకలవరపడుతున్నారు. శ్రీనివాసరావుకు సంబంధించిన ప్రతీచోట అనగా హైదరాబాద్, విజయవాడలో సోదాలు నిర్వహించారు. ఇందులో భాగంగానే రూ.150 కోట్ల నగదుతో పాటు పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈయన ఎన్నికలకు ముందు బాబుకు పీఎస్‌గా పనిచేసారు. అయితే ఆయనకు ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే అనుమానంతో సోదాలు చేసారు. దీనిపై స్పందించిన వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా బాబుకి చుక్కలు చూపించారు. “మాజీ పీఏతోపాటు తాను పెంచి పోషించిన అవినీతి సర్పాలపై జరుగుతున్న ఐటీ సోదాలపై చంద్రబాబు నోరువిప్పడం లేదు. నిప్పు కణికల్లాంటి వారిపై ఈ దాడులేంటని ఐటీ శాఖను నిలదీయాలి. రెండ్రోజులుగా కిక్కురుమనకుండా, కియా లేచిపోతోందని ఫేక్ వార్తలతో ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నాడు”.