ప్రధానమంత్రి నరేందర్ మోదీ గురువారం రాజ్యసభలో మాట్లాడుతూ” తలుపులు వేసి తెలంగాణను బలవంతంగా ఇచ్చారు. ఏపీ,తెలంగాణ ప్రజలతో మాట్లాడాల్సింది. ఎవర్ని సంప్రదించకుండా ఏపీ నుండి తెలంగాణను వేరు చేసింది అని కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు.
ప్రధాని స్థానంలో ఉన్న నరేందర్ మోదీ తెలంగాణ పోరటాన్ని.. ఎంతో మంది విద్యార్థుల ఆత్మబలిదానాలను కించపరిచేలా మాట్లాడారని తెలంగాణ వాదుల నుండి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. మరోవైపు టీఆర్ఎస్ కు చెందిన నేతలు,మంత్రులు,ఎమ్మెల్యేలు,ఎంపీలు కూడా ప్రధాని మాట్లాడిన తీరును ఎండగడుతున్నారు.
అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన ఎంపీలు తమ అగ్రహాన్ని వ్యక్తం చేస్తూ” తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై మోదీ వ్యాఖ్యలు సరైనవి కావు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. గత ఆరేళ్లుగా ఇలాగే సమయం వచ్చిన ప్రతిసారి తెలంగాణపై ప్రధాని మోదీ విషం కక్కుతున్నారు. నిజంగా బలవంతంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగి ఉంటే బీజేపీ ఎందుకు సంబురాలు చేసుకుందో వివరించాలని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు కొత్తగా ఏర్పాటు అయిన తెలంగాణకు కేంద్రం చేసింది ఏమి లేదు అని వారు హెద్దేవా చేశారు.