ప్రస్తుతం టీమిండియాలో బాగా రాణిస్తున్న ఆటగాళ్ళలో కేఎల్ రాహుల్ ముందున్నాడని చెప్పాలి. ఎందుకంటే గతఏడాది కాఫీ విత్ కరణ్ షో లో మాట్లాడిన మాటలకు జట్టు నుండి దూరమయ్యాడు రాహుల్. ఆ తరువాత కొన్ని రోజులకి మల్లా జట్టులోకి వచ్చిన రాహుల్ మంచి ఆటను కొనసాగించాడు. అటు టీ20 ఇటు వన్డేల్లో తాను ఏ స్థానంలోనైనా ఆడగలడు అని నిరూపించుకున్నాడు. ఇక ఈ ఏడాదిలో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని శభాష్ అనిపించుకున్నాడు. ఇక న్యూజిలాండ్ తో జరిగిన టీ20 సిరీస్ లో అయితే ఏకంగా మాన్ అఫ్ ది సిరీస్ కైవశం చేసుకున్నాడు. ఇక ఈ 2020లో 500పరుగులు చేసిన మొదటి ఆటగాడు అయ్యాడు. రాహుల్ 557 పరుగులతో మొదటి స్థానంలో ఉండగా రెండో స్థానంలో కోహ్లి 395 పరుగులతో ఉన్నాడు.