బ్యాంకుల రుణాల ఎగవేతలో టీడీపీ నేతలు ఒకరిని మించి ఒకరు పోటీపడుతున్నారు. ఒకప్పటి చంద్రబాబు సన్నిహితుడు, ప్రస్తుత బీజేపీ ఎంపీ సుజానాచౌదరి దాదాపు 6 వేల కోట్లు బ్యాంకు రుణాలు ఎగవేసిన కేసులో ఇరుక్కున్నారు. తాజాగా టీడీపీ ఎమ్మెల్యే, సినీనటుడు బాలయ్య చిన్నఅల్లుడు, నారాలోకేష్ తోడల్లుడు భరత్ కూడా రుణాల ఎగవేత కుంభకోణంలో కూరుకుపోయారు. గత సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ పార్లమెంట్ నుంచి పోటీ చేసిన భరత్ వైసీపీ అభ్యర్థి చేతిలో ఎంవీవీ సత్యనారాయణ చేతిలో ఓడిపోయారు. ఓటమి తర్వాత చంద్రబాబు తీరుపై భరత్ గుర్రుగా ఉన్నారు. విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటుకు ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు చేసిన తీర్మానానికి భరత్ కూడా మద్దతు పలికారు. ఇక విషయానికి వస్తే… తాజాగా రుణాల చెల్లింపు ఎగవేసిన కారణంగా భరత్ తండ్రి పట్టాభి రామారావు సహా ఇతర కుటుంబీకుల ఆస్తుల జప్తునకు అబిడ్స్ కరూర్ వైశ్యా బ్యాంకు నోటీసులు జారీ చేసింది. కాగా టెక్నో యూనిక్ ఇన్‌ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరిట భరత్ కుటుంబీకులు తీసుకున్న రుణం అసలు, వడ్డీ కలిపి రూ. 124 కోట్ల 39 లక్షల 21 వేల, 485 పైసలు.. జనవరి 21, 2020లోగా చెల్లించాలని గతంలో బ్యాంకు నోటీసులు జారీ చేసింది.
అయితే భరత్ కాని, ఆయన కుటుంబసభ్యులు కాని రుణాల చెల్లింపుపై స్పందించపోవడంతో సదరు బ్యాంకు భరత్‌తో సహా ఆయన కుటుంబీకుల ఆస్తులను జప్తు చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు రుణం కోసం బ్యాంకులో తాకట్టు పెట్టిన గాజువాక మండలం, భీమిలి మండలంలోని భరత్‌కు చెందిన భూములను స్వాధీనం చేసుకుని, వేలం వేస్తామని హెచ్చరించింది. ఇక గతంలో భరత్ ఆంధ్రా బ్యాంకుకు సుమారు రూ. 100 కోట్ల రుణం ఎగవేసినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు కరూర్ వైశ్యా బ్యాంకుకు దాదాపు 125 కోట్ల రుణం ఎగవేయడంతో ఆస్తుల జప్తునకు నోటీసు జారీ అయ్యింది. అయితే భరత్‌కు బ్యాంకు రుణాలు చెల్లించే స్థోమత లేదా…కావాలనే ఎగ్గొడుతున్నారా అన్నది తెలియాల్సి ఉంది. కాని లోకేష్ తోడల్లుడు, గీతం యూనివర్సిటీ వారసుడైన భరత్‌కు 125 కోట్ల రుణం చెల్లింపు అనేది పెద్ద లెక్కలో కాదు. గతంలో కూడా ఆంధ్రా బ్యాంక్‌కు భరత్ 100 కోట్లు రుణాలు ఎగ్గొట్టినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు కరూర్ వైశ్యా బ్యాంకు ఆస్తుల జఫ్తుకు సిద్ధమైంది. మొత్తంగా బాలయ్య చిన్నఅల్లుడు ఇలా వరుసగా బ్యాంకు రుణాలు ఎగ్గొడుతూ..తన పరువు తానే తీసుకుంటున్నాడనే చెప్పాలి.