టాలీవుడ్ సెన్సేషనల్ మరియు తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. బాహుబలి సినిమాతో రికార్డులు సృష్టించాడు. ఇప్పుడు అదే ఊపుతో రాంచరణ్, ఎన్టీఆర్ హీరోలాగా పెట్టి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోతున్నాడు. ప్రస్తుతం చిత్ర యూనిట్ షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉంది. అంతేకాకుండా వచ్చే ఏడాది జనవరి 8న చిత్రం విడుదల కానుంది అని చెప్పడం కూడా జరిగింది. దాంతో దిల్ రాజుతో సహా డిస్ట్రిబ్యూటర్లు అందరు రాజమౌళి, దానయ్యల వద్దకు ఎగబడుతున్నారు. ఇక దిల్ రాజు అయితే నైజాం కు సంబంధించి దాదాపు తనకు సొంతం చేసుకున్నట్టే. దీనికి సంబంధించి 75కోట్లు వరకు ఇస్తానని ముందుకు వచ్చాడట. ఇక మరోపక్క ఈస్ట్ చూసుకుంటే భారత్ కుమార్ చౌదరి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా అతడికి ఎన్టీఆర్ సపోర్ట్ కూడా ఉండడం విశేషం.
