కియామోటార్స్..ప్రధాని నరేంద్ర మోదీ కొరియాతో ఒప్పందంలో భాగంగా ఇది ఏపీకి రావడం జరిగింది. కాని చంద్రబాబు మాత్రం దీనిని తన ఖాతాలో వేసుకున్నారు. అయితే చంద్రబాబు ప్రపంచంలో ఎక్కడ ఏది జరిగిన అది నావల్లే అని చెప్పుకునే వ్యక్తి అని అందరికి తెలిసిన విషయమే. ఇదంతా పక్కనపెడితే గత ఎన్నికలకు ముందు చంద్రబాబు కియా కార్ విడుదల చేసాం అంటూ ఒక కార్ కి బ్లాక్ క్లాత్ వేసి అందరికి పిక్చర్ చూపించాడు. కాని దాని అసలు భాగోతం బయటపడడంతో బాబు పరువు మొత్తం పోయింది.ఆ తరువాత నూతన సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన జగన్ కియా కార్ ను ప్రారంభించారు. ఇక అసలు విషయానికి వస్తే మొన్నటివరకు చంద్రబాబు మూడు రాజధానుల విషయంలో ఏవేవో ప్రయత్నాలు చేసారు. అవన్నీ బెడిసికొట్టడంతో ఇప్పుడు కియా సంస్థపై పడ్డారు. దీనిపై ఘాటుగా స్పందించిన విజయసాయి రెడ్డి “ఎంత పెద్ద అబద్ధమైనా రాయిస్తాడు చంద్రబాబు. అన్నింటికి తెగబడి పోయాడు. ఎల్లో మీడియా వార్తలు ప్రజలు నమ్మడం లేదని రాయిటర్ ఏజెన్సీ పేరుతో కియా వెళ్లిపోతుందని అభూత కల్పన సృష్టించాడు. ప్రజా క్షేత్రంలో తేల్చుకునే దమ్ములేక ఇలాంటి పిరికిపంద పనులకు పాల్పడుతున్నాడు” అని అన్నారు.
