చాలా చోట్ల నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని, కనీస ప్రమాణాలు పాటించడంలేదని సమావేశంలో చర్చ జరిగింది.ఏదైనా జరగరానిది జరిగితే.. పెద్ద సంఖ్యలో పిల్లలకు ముప్పు ఉన్న పరిస్థితులు కూడా ఉన్నాయని సమావేశంలో చర్చ జరిగింది. ఇలాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని జగన్ ఆదేశించారు.
అధికఫీజులపై కూడా దృష్టిపెట్టాలని ఉన్నత ప్రమాణాలు, నాణ్యమైన విద్య ఉండాలని స్పష్టంచేసారూ జగన్. మన బడి నాడు–నేడు తొలివిడత కార్యక్రమం ప్రగతి ఇవ్వాళ్టి వరకూ సమీక్షించారు. 15,715 పాఠశాలల్లో తొలివిడత మనబడి నాడు–నేడు కార్యక్రమం జరిగింది.
8853 ప్రైమరీ స్కూళ్లు, 3068 అప్పర్‌ప్రైమరీ స్కూళ్లు, 2457 హైస్కూళ్లు, 1337 రెసిడెన్షియల్ స్కూళ్లు. మొత్తంగా
15,072 స్కూళ్లకు రూ. 3,373 కోట్లతో ప్రతిపాదనలు పూర్తి
14,843 స్కూళ్లకు పరిపాలనా పరమైన అనుమతులు
14,591 స్కూళ్లలో తల్లిదండ్రుల కమిటీలతో అవగాహన ఒప్పందం
12,647 స్కూళ్లలో పనులకు భూమి పూజ
బ్యాంకు ఖాతాలు తెరిచిన 14,851 విద్యా కమిటీలు.
రెండో విడతలో నాడు – నేడు కింద
9476 ప్రాథమిక పాఠశాలలు
అప్పర్ ప్రైమరీ స్కూళ్లు 822
హైస్కూల్స్ 2771 స్కూళ్లు
ప్రభుత్వ హాస్టళ్లు 1407 స్కూళ్లు
జూనియర్ కళాశాలలు 458 స్కూళ్లు
మొత్తంగా 14,934
మూడో విడతలో నాడు – నేడు కింద
15,405 ప్రైమరీ స్కూళ్లు
అప్పర్ ప్రైమరీ స్కూళ్లు 216
హైస్కూల్స్ 41
రెసిడెన్షియల్ స్కూళ్లు 63
గవర్నమెంటు హాస్టళ్లు 248
జూనియర్ కళాశాలలు 18
మూడో విడతలో మొత్తంగా 15,991