ఏపీ సీఎం,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఈ రోజు శుక్రవారం హైదరాబాద్లోని సీబీఐ కోర్టుకు అక్రమాస్తుల కేసులో హాజరుకావాల్సి ఉన్న సంగతి విదితమే.
ఈ క్రమంలో ముఖ్యమంత్రి జగన్ ఈ రోజు శుక్రవారం హైదరాబాద్ పర్యటన రద్దు అయింది. రాష్ట్రంలోని రాజమహేంద్రవరంలో జరిగే దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవం కార్యక్రమం ఉండటంతో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
అంతేకాకుండా సీబీఐ,ఈడీ కోర్టులకు చెందిన న్యాయమూర్తులు సెలవులో ఉండటం కూడా జగన్ పర్యటన రద్దుకు కారణమైంది. దీంతో ఏపీలోని తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలోనే ముఖ్యమంత్రి జగన్ ఉండనున్నారు.