గత కొద్ది రోజులుగా కియా మోటార్స్ పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ తెలుగుదేశం శ్రేణులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఆ పరిశ్రమ తరలి వెళ్లి పోతుంది జగన్ ప్రభుత్వ విధానాలు నచ్చకే ప్రతినిధులు చేతులెత్తేశారు అంటూ టిడిపి సోషల్ మీడియాలో భారీగా ప్రచారం చేసింది ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు లోక్సభలో ఇవాళ గురించి మాట్లాడుతుండగా అనంతపురం జిల్లా హిందూపురం పార్లమెంటు కు చెందిన వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ కలుగజేసుకుని మాట్లాడుతున్న వి తెలుగుదేశం పార్టీ చేస్తున్నవి అన్నీ అసత్య ప్రచారాలు అన్నారు. దీంతో రామ్మోహన్ నాయుడు మాటలకు గోరంట్ల మాధవ్ అడ్డు తగలడం పట్ల తెలుగుదేశం పార్టీకి చెందిన ఇతర ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేశారు దీంతో కాసేపటి తర్వాత మిథున్ రెడ్డి మాట్లాడుతూ చాలా వివరంగా సమాధానం చెప్పారు. తను కియా తో మాట్లాడినట్లు ఎక్కడికి వెళ్లడం లేదని స్పష్టంగా తెలియజేశారు.
