జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లో బీజీ కానున్నారు. ఆయన వరసగా సినిమాలు చేయడానికి సిద్దమైయ్యారు. ‘పింక్’ సినిమా తెలుగు రీమేక్ లో పవన్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే పవన్ ,ఆలీ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అధి ఏమిటంటంటే ఆంధ్ర రాజకీయాలతో ఇరువురి మధ్య పెరిగిన దూరాన్ని పక్కనబెట్టి పవన్ కళ్యాణ్ ఆలీకి ఫోన్ చేశారని వార్తలు వస్తున్నాయి. ‘పింక్’ రీమేక్‌లో నటించాలని ఆలీని స్వయంగా కోరారని ఇండస్ట్రీ వర్గాలు చెపినట్లు.. ఆలీ ఇంకా తన నిర్ణయాన్ని వెల్లడించలేదనే వార్త హల్ చల్ చేస్తోంది. పవన్ ఆలీకి ఫోన్ చేశారన్న ఈ వార్తలో నిజమెంతో తెలీదు కానీ తెలుగు సినీ ఇండస్ట్రీలో, పోషల్ మీడియాలో హాల్ టాపిక్ గా మారి పోయింది..ఎవరికి ఎవరు ఫోన్ చేశారు అనేది తెలిస్తేగాని ఈ వార్తకు ముగింపు ఉండదు. ఇకపోతే గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ జనసేన కాదని ఆలీ వైసీపీలో చేరారు. ఆలీకి సినిమాల్లో అవకాశాలు ఇచ్చానని పవన్ విమర్శలు చేశారు. ఆలీ కూడా అంతే ఘాటుగా విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రాకముందు తాను సినిమాల్లో ఉన్నానని బదులిచ్చారు. దీంతో రాజకీయంగా ఆలీ పవన్ ఒకరిపై ఒకరు తీవ్రస్తాయిలో విమర్శలు కూడా చేసుకున్నారు
