అభివృద్ధి వికేంద్రీకరణ, మూడు రాజధానులకు మద్దతుగా వైసీపీ నేతలు, విద్యార్థి సంఘాలు గురువారం రాష్ట్ర వ్యాప్తంగా మానవహారం నిర్వహించారు. ‘ఒకే రాజధాని వద్దు.. మూడు రాజధానులే ముద్దు’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో సర్వతోముఖాభివృద్దేలక్ష్యంగా ముఖ్యమంత్రి సీఎం జగన్ తీసుకున్న 3 రాజధానుల నిర్ణయాన్ని స్వాగతించాల్సిన టిడిపి నాయకులు అమరావతి రాజధాని ఉండాలి మూడు రాజధానులు వద్దు అనే నినాదాలతో పెయిడ్ ఆర్టిస్ట్ లతో డ్రామాలు ఆడుతు రాయలసీమకు, ఉత్తరాంధ్ర అభివృద్ధికి అడ్డం పడుతున్న నారా చంద్రబాబు నాయుడు తీరు పట్ల ఏపీ ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనికి నిరసనగా వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి ఆద్వర్యంలో పత్తికొండలో పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ దగ్గర మానవహారంగా ఏర్పడి మూడు రాజధానులు కావాలని నిరసన వ్యక్తం చేశారు . వీరితో పాటు కేడీసీసీ బ్యాంకు మాజీ వైస్ చైర్మన్ రామచంద్రారెడ్డి , పత్తికొండ, తుగ్గలి మండలాల కన్వీనర్లు, జిల్లా నాయకులు మరియు ప్రజలు స్వచ్ఛంద సేవా సంస్థలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.