తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనయ,నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత నిజామాబాద్ లో పసుపుబోర్డు పెట్టాలని చేసిన పోరాట ఫలితమే కేంద్ర ప్రభుత్వం జిల్లాలో సుగంధ ద్రవ్యాల బోర్డు ప్రాంతీయ కార్యాలయాన్ని మంజూరు చేసింది అని టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాష్ తెలిపారు.
నిన్న బుధవారం పార్లమెంట్ మీడియా పాయింట్ దగ్గర ఎంపీ ప్రకాష్ మాట్లాడుతూ” వరంగల్ లో ఉన్న ప్రాంతీయ కార్యాలయాన్ని తరలించవద్దు అని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ను కోరమని ఆయన అన్నారు.
ఈ మేరకు దీనికి సంబంధించి లిఖిత పూర్వకంగా హామీచ్చారు అని కూడా స్పష్టం చేశారు.