తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాదీ బిర్యానీ ప్రపంచంలోనే అద్భుతమని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు అన్నారు.
పారిస్ కు చెందిన తలసేరీ ఫిష్ బిర్యానీని అభివర్ణిస్తూ నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ చేసిన ట్వీట్ కు మంత్రి కేటీ రామారావు స్పందిస్తూ ప్రపంచంలోనే ఉత్తమ బిర్యానీగా చెప్పుకునే హక్కులన్నీ హైదరాబాద్ వే.
మిగతా బిర్యానీలన్నీ అనుకరణాలే. ఇటీవల యూనెస్కో కూడా మా రుచికరమైన ఆహార సంస్కృతిని గుర్తించి ఒక బిరుదును కూడా ప్రధానం చేసింది”అని రిప్లైలో ట్వీట్ చేశారు.