తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరంలోని హైదరాబాద్ లో మూడో మెట్రో కారిడార్ సంబంధిత జేబీఎస్ నుండి ఎంజీబీఎస్ వరకు మెట్రో మార్గాన్ని ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ రేపు శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభించనున్నారు.
దీనికి సంబంధించిన పనులపై మంత్రి కేటీ రామారావు నిన్న బుధవారం ప్రగతి భవన్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ” హైదరాబాద్ మెట్రో రైలు ప్రపంచంలోనే అతి పెద్ద పబ్లిక్,ప్రయివేట్ పార్టనర్శిప్(పీపీపీ)ప్రాజెక్టు.
దీని నిర్మాణంలో అందుకున్న పలు మైలురాళ్లు,అవార్డుల వంటి పలు అంశాల గురించి ప్రజలకు వివరించాలి. రేపు శుక్రవారం ముఖ్యమంత్రి పాల్గొనున్న ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక మంత్రులు,ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు,ఎంపీలు,ప్రజాప్రతినిధులు,కార్యకర్తలు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని”మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు…..