గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఓట్లకోసం ఎన్నో అసత్యపు మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి చివరికి గెలిచాక వారిని గాలికి వదిలేసారు. ఉన్న అధికారాన్ని సొంత పనులకే ఉపయోగించాడు తప్పా ప్రజలకు చేసింది ఏమీ లేదు. ఇక ఈ విషయం పక్కనపెడితే రాష్ట్రానికి పరిశ్రమల విషయానికి వస్తే కియా సంస్థ విషయంలో బాబు చేసినవన్నీ అందరు గమనించారు. కియా మేనేజ్మెంట్ కూడా బాబు బండారం బయటపెట్టేసింది. అయితే తాజాగా దీని విషయంలో కొన్ని తప్పుడు సమాచారాలు బయటకు వస్తున్నాయి. దీనిపై స్పందించిన విజయసాయి రెడ్డి “కియా మోటార్స్ తన సంస్థను ఏపీ నుండి మార్చడం గురించి కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేస్తున్న పుకార్లు పూర్తిగా అబద్ధమని మా ప్రభుత్వం గౌరవ సీఎం వైయస్ జగన్ గారి నేతృత్వంలో కియాతో అద్భుతమైన సంబంధాన్ని పంచుకున్నారు మరియు రాష్ట్రంలో వారి వృద్ధి ప్రణాళికలకు మేము పూర్తిగా మద్దతు ఇస్తున్నాము” అని చెప్పుకొచ్చారు.
