ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మరోసారి భారీ షాక్ తగిలింది. చంద్రబాబు వద్ద సుదీర్ఘ కాలం పాటు పీఏగా పనిచేసిన శ్రీనివాస్ ఇంట్లో ఐటి సిబిఐ అధికారులు ఏకకాలంలో దాడులు చేస్తున్నారు. విజయవాడ హైదరాబాదులోని శ్రీనివాస్ పోలీసు బందోబస్తు మధ్య సోదర నిర్వహించడం ఇప్పుడు రాజకీయంగా ఆసక్తిని రేపుతోంది. శ్రీనివాస్ గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పరాజయం పాలయ్యేవరకూ చంద్రబాబు వద్ద పనిచేశారు. అంతకు ముందు చంద్రబాబు ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో చంద్రబాబు వద్దే ఆయన ఉన్నారు. అయితే ఆయన సాధారణ పరిపాలన ఉద్యోగి కావడంతో ఎన్నికల్లో చంద్రబాబు ఓటమి పాలైన తర్వాత మళ్ళీ తిరిగి ఆయన డిపార్ట్మెంట్ కి వెళ్ళిపోయారు. చంద్రబాబు కు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలన్నీ శ్రీనివాస్ చూసేవారు.. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో శ్రీనివాస్ ఐటీ అధికారులు దాడులు నిర్వహించడం ఆసక్తి రేపుతోంది.