ఆసియా ఖండంలోనే అతిపెద్ద వనజాతర మేడారం జాతర. ఈ జాతరలో సుమారుగా రెండు కోట్లకు పైగా ప్రజలు,భక్తులు దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల నుండి పాల్గొంటారు. అయితే అసలు మేడారం జాతర ఎప్పుడు మొదలైంది..?. ఎవరు ప్రారంభించారు..?. ఎందుకు ప్రారంభించారో తెలుసుకుందాము..
యుద్ధానికి వ్యతిరేకంగా తమ సైనికులు చేసిన తప్పిదాన్ని గ్రహించిన ప్రతాప రుద్రుడు పశ్చాతాపానికి గురవుతాడు. దీంతో మేడారాన్ని చేరుకుని కోయలకు క్షమాపణ చెప్తాడు. మేడారాన్ని తిరిగి కోయలకు ఇచ్చేస్తాడు.
ఆ తర్వాత సమ్మక్క భక్తుడిగా మారిన ప్రతాప రుద్రుడు ముత్తైదువులు అందరూ కల్సి సమ్మక్క జాతరను జరుపుకోవాలని .. ఇది ప్రతి రెండేళ్లకు ఒకసారి జరగాలని ఆదేశించాడు. దీంతో అప్పటి నుండి ప్రతి రెండేళ్లకు గిరిజనులు సమ్మక్క ప్రతిరూపమైన కుంకుమ భరణిని పూజించడం మొదలు పెట్టారు