తెలంగాణ కుంభమేళా మేడారం జాతర ఈ రోజు బుధవారం మొదలు కానున్నది. మొత్తం నాలుగు రోజుల పాటు ఈ జాతర జరుగుతుంది.
సమ్మక్క సారక్కలను ఈ నాలుగు రోజుల పాటు ఏం కోరుకున్న కానీ నెరవేరుతుంది అని ప్రగాఢ నమ్మకం భక్తుల్లో ఉంది. దీంతో తమ కోరికలు నెరవేరాలని చాలా మొక్కులు మొక్కుకుంటారు.
కోరికలు తీరితే ఎడ్లబండి కట్టుకోని వస్తాము. అమ్మవారి రూపంలో వస్తాము. ఒడి బియ్యం తీసుకువస్తాము. ఎదురుకోళ్లు,గాజులు,రవికెలు సమర్పస్తాము. మేకలు బలి ఇస్తాము. అని ఇలా పలు రకాలుగా భక్తులు మొక్కుకుంటారు. అయితే ప్రధానంగా నిలువెత్తు బంగారం ఇస్తామని మొక్కుకుంటారు. అంతకు తూగే బెల్లాన్ని అమ్మవార్లకు సమర్పిస్తారు.