బుధవారం న్యూజిలాండ్, ఇండియా మధ్య మొదటి వన్డే ప్రారంభం అయ్యింది. ఇందులో భాగంగా ముందుగా టాస్ గెలిచి కివీస్ ఫీల్డింగ్ తీసుకుంది. ఇండియన్ డెబ్యు ఓపెనర్స్ మయాంక్ , పృథ్వీ షా పర్లేదు అనిపించారు. అనంతరం వచ్చిన కెప్టెన్ కోహ్లి అర్దశతకం సాధించారు. కాసేపటికి కోహ్లి అవుట్ అవ్వగా ఐయ్యర్, రాహుల్ చక్కగా ఆడారు. ఇక అసలు విషయానికి భారత్ కు ఇప్పటివరకు ఉన్న ఒకేఒక ఆందోళన మిడిల్ ఆర్డర్ కాని ఈరోజు వారిద్దరి ఆట చూస్తే ఇక బయపడాల్సిన అవసరం లేదనే చెప్పాలి. ఒక పక్క ఐయ్యర్ శతకం సాధించగా మరోపక్క రాహుల్ సెంచరీకి దగ్గరలో ఉన్నాడు. ఇదే ఫామ్ కొనసాగిస్తే వారికి తిరుగుండదని చెప్పాలి.
