గత చంద్రబాబు ప్రభుత్వంలో మద్యం పేరు చెప్పి ఎన్నో కోట్లు నొక్కేసారు. ఇది అందరికి తెలిసిన విషయమే. అప్పట్లో మద్యం విచ్చలవిడిగా అమ్మడం వల్ల ఇంట్లో ఆడవాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడేవారు. అయితే ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో జగన్ పాదయాత్రలో భాగంగా ఆడవాళ్ళకు నేనున్నానంటూ భరోసా ఇచ్చి వారికి న్యాయం చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. దానికి కట్టుబడి ఉన్న జగన్ గగెలిచిన తరువాత ఇచ్చిన మాట ప్రకారం మద్యం షాపుల విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇక ఒక్కకటిగా ముందుకు వెళ్తూ షాపుల సంఖ్య తగ్గించడం, రేట్లు పెంచడం వంటివి చేసారు. దీనిపై చంద్రబాబు ఎప్పటిలానే ఏదో చెయ్యాలనుకున్నారు. దాంతో ట్విట్టర్ వేదికగా స్పందించిన విజయసాయి రెడ్డి “మద్యం ధరలు పెంచినా ఆదాయం ఎందుకు పెరగడం లేదని చంద్రబాబు గోల పెడుతున్నాడు. బిజినెస్ మైండ్ కదా? ప్రతిదీ లాభనష్టాల కోణంలోనే చూస్తాడు. రేట్లు పెంచింది రాబడి కోసం కాదు బాబూ. తాగడం తగ్గించడం కోసం. సీఎం జగన్ గారు జిల్లాకో డీ-అడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేయించారు. మీరూ నిరభ్యంతరంగా చేరొచ్చు” అని అన్నారు.
