ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అమలు చేయనున్నారు అని వార్త ప్రస్తుతం సోషల్ మీడియా సర్కిల్స్ లో వినిపిస్తోంది. జగన్ మానసపుత్రిక అయిన గ్రామ వాలంటీర్ల పథకాన్ని అమలు చేయాలని కేజ్రీవాల్ సర్కారు ఆలోచన చేస్తోందట. ఈ మేరకు వచ్చే ఎన్నికల్లో గెలిస్తే స్పష్టంగా ప్రతి పథకాన్ని డోర్ డెలివరీ చేస్తానని కేజ్రీవాల్ టీం ప్రారంభించిందట. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయ ద్వారా వాలంటీర్లు ఇంటికి వెళ్లి ఏపీలో ప్రతి పథకాన్ని డోర్ డెలివరీ చేస్తున్నారు. గతేడాది పాదయాత్రలో ఉన్న జగన్ మోహన్ రెడ్డి అప్పటి ప్రతిపక్ష నాయకుడిగా హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి పథకాన్ని అమలు చేస్తానని చెప్పిన విధంగానే ప్రస్తుతం వాలంటీర్ల ద్వారా ప్రభుత్వ పథకాలను ఇంటికి చేరవేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.
