బుధవారం న్యూజిలాండ్, ఇండియా మధ్య మొదటి వన్డే ప్రారంభం అయ్యింది. ఇందులో భాగంగా ముందుగా టాస్ గెలిచి కివీస్ ఫీల్డింగ్ తీసుకుంది. ఇండియన్ డెబ్యు ఓపెనర్స్ మయాంక్ , పృథ్వీ షా పర్లేదు అనిపించారు. అనంతరం వచ్చిన కెప్టెన్ కోహ్లి అర్దశతకం సాధించారు. అనంతరం ఐయ్యర్, రాహుల్ తమదైన శైలిలో కివీస్ బౌలర్స్ పై విరుచుకుపడ్డారు. ఐయ్యర్ ఏకంగా 103 పరుగులు సాధించాడు.ఆఖరిలో రాహుల్, జాదవ్ బౌండరీల మోత మోగించారు. ఫలితం టీమిండియా నిర్ణీత 50ఓవర్స్ లో నాలుగు వికెట్ల నష్టానికి 347భారీ పరుగులు సాధించింది. ఇక కేఎల్ రాహుల్ 88 , జాదవ్ 26 పరుగులతో నిలిచారు. ఇక కివీస్ ఈ టార్గెట్ చేజ్ చేస్తుందో లేదో చూడాలి.