రాయలసీమలో గత కొద్ది నెలలుగా నకిలీ మద్యం పై పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారు. రాయలసీమా రేంజ్ డీఐజీ ఆదేశాల మేరకు నేడు ఏక కాలంలో కెఈ ప్రతాప్,అయ్యప్ప,పుట్లూరు శ్రీను ఇళ్లలో సోదాలు చేయడం జరిగింది. మూడు బృందాలుగా ఏర్పడి డోన్ టీడీపీ నాయకుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు.డోన్ లో మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సోదరుడు, డోన్ టీడీపీ ఇన్చార్జి కేఈ ప్రతాప్ ఇంట్లో సోదాలు చేశారు. ఈ కేసులో ఇప్పటికే 22 మంది అరెస్టు అయ్యారు. కేఈ ప్రతాప్ 26వ నిందితుడుగా కేసు నమోదు చేశారు.