తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో గత సార్వత్రిక ఎన్నికల నుండి నిన్నటి మున్సిపల్ ఎన్నికల వరకు ప్రతి ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయకేతనం ఎగురవేస్తున్న సంగతి విదితమే. ప్రస్తుతం సహకార ఎన్నికల తప్పా ఎలాంటి ఎన్నికలు లేని క్రమంలో రాష్ట్రంలోని దాదాపు ఇరవై మూడు వేల మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో త్వరలోనే సమావేశం కానున్నారు అని సమాచారం.
హెచ్ఐసీసీ వేదికగా ఈ మహా సమ్మేళనం జరగనున్నది. రాష్ట్రంలోని పంచాయతీలు,మండల పరిషత్,జిల్లా పరిషత్,పురపాలక,నగర పాలక,నగర పంచాయతీలకు చెందిన ఇరవై మూడు వేల మంది ప్రజాప్రతినిధులతో క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా ఈ సమావేశం జరగనున్నది.
ముప్పై రెండు జిల్లా పరిషత్ ల చైర్మన్లు,584మంది జెడ్పీటీసీ,584ఎంపీటీ అధ్యక్షులు,5,817ఎంపీటీసీలు,13నగర పాలక సంస్థల మేయర్లు,120పురపాలక సంఘాల చైర్ పర్శన్లు,3,300మంది కౌన్సిలర్లు,వార్డు మెంబర్లు ,12,751మంది సర్పంచులు ఇలా అందరితో ఈ సమావేశం జరగనున్నది. అయితే దీనికి సంబంధించిన ముహుర్తం త్వరలోనే ఖరారు కానున్నది.