అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులను ఏర్పాటు చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఈ క్రమంలో అమరావతి ఉద్యమం పేరుతో అభివృద్ధి మొత్తం ఉండాలని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఇటీవల ఆందోళనలు చేస్తున్నారు. అయితే తాజాగా జగన్ ను రాజధాని ప్రాంత రైతులు అందరూ కలిసి తమ సమస్యలు విన్నవించారు. వారితో జగన్ మాట్లాడుతూ… ప్రస్తుతం రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో కొన్ని వేల కోట్లు ఒకే ప్రాంతంలో మనం పెట్టలేమని అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నానికి మరింత చేయూతనిచ్చి రాజధానిగా అభివృద్ధి చేసుకుంటే మంచిదని అమరావతి ప్రాంతాన్ని విస్మరించకుండా నేను కూడా అభివృద్ధి చేస్తానని, రాష్ట్రం మొత్తం బాగుండాలి అని తన కోరిక అని వెల్లడించారు. అయితే చంద్రబాబు ఇప్పటివరకు రాజధానిలోనే ఉద్యమం చేయగా రైతులు సీఎం జగన్ ని కలిసిన తర్వాత చంద్రబాబు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ఉద్యమం చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే ఒంగోలులోని ఇవాళ ఉద్యమం చేపట్టారు. రైతులు అమరావతి ప్రాంత ప్రజలు జగన్ మాట విని ఆందోళన చేయకపోతే తన పరిస్ధితి ఏమిటన్న భయం తోనే చంద్రబాబు ఇలా వేరే ప్రాంతాల్లో ప్లాన్ చేసినట్లు స్పష్టమవుతోంది.
