హిందూపురం ఎమ్మెల్యే బాలయ్యపై వైసీపీ ఫైర్ బ్రాండ్, నగరి ఎమ్మెల్యే రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాజాగా అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ…. తన సైగ చేస్తే వైసీపీ నేతల పరిస్థితి ఏమయ్యేది..నా మౌనాన్ని చేతకానితనంగా తీసుకోవద్దు అంటూ బాలయ్య ఇచ్చిన వార్నింగ్‌పై రోజా స్పందించారు. నాడు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు బాలకృష్ణ సైగ చేసి బుద్ధి చెప్పి ఉంటే బాగుండేది…రాయలసీమ నుంచి చంద్రబాబును, బాలకృష్ణను తరిమికొట్టే రోజు వస్తుందంటూ మండిపడ్డారు. ఇక ఏపీ విజిలెన్స్ కార్యాలయం, కమిషనరేట్ ఆఫ్ ఎంక్వయిరీస్ చైర్మన్, కమిషనర్ ఆఫ్ ఎంక్వయిరీస్ సభ్యుల కార్యాలయాలను కర్నూలుకు తరలిస్తూ జగన్ సర్కార్ జీవో నెం.13 విడుదల చేయడంపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పందిస్తూ…ఇది చీకటి జీవో, అని ఈ జీవోపై సంతకాలు చేసిన అధికారులే బలవుతారని ఆరోపించారు. అసలు విజిలెన్స్ కమిషనర్ కార్యాలయాన్ని కర్నూలుకు ఎందుకు తరలిస్తున్నారో అర్థం కావడం లేదని ప్రభుత్వంపై విమర్శలు చేశారు. పవన్ విమర్శలకు ఎమ్మెల్యే రోజా కౌంటర్ ఇచ్చారు.
జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు జీవోల గురించి తెలియదని ఎద్దేవా చేశారు. చీకటి జీవోలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, పవన్ దానికి వంతపాడుతున్నారని ధ్వజమెత్తారు. మూడురాజధానులకు అనుగుణంగా జగన్ అడుగులు వేస్తున్నారని రోజా చెప్పుకొచ్చారు. ఇక శాసనమండలిలో ఉన్నవారంతా చంద్రబాబు భజనపరులే అని… వారు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అని తీవ్రంగా దుయ్యబట్టారు. ఈ సందర్భంగా లోకేష్‌పై కూడా రోజా ఫైర్ అయ్యారు. పెద్దల సభకు పెద్దలను తీసుకురాకుండా దద్దమ్మలను తీసుకొచ్చారని ఫైర్ అయ్యారు..తన కొడుకు లోకేష్ ఎమ్మెల్యేగా గెలవలేడు..రాజకీయ భవిష్యత్తు సమాధి అవుతుందని చంద్రబాబు భయపడుతున్నాడని… అందుకే మండలి రద్దును అడ్డుకుంటున్నారని ఎమ్మెల్యే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్‌లను ఎమ్మెల్యే రోజా తనదైన స్టైల్లో పంచుల్లాంటి డైలాగులతో ఉతికిఆరేసింది.