తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు కొత్త రెవిన్యూ డివిజన్ల ఏర్పాటుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం అంగీకరించింది.
రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాలో జోగిపేట,సిరిసిల్ల జిల్లాలో వేములవాడలను కొత్త రెవిన్యూ డివిజన్లుగా ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రిలిమినరీ నోటిఫికేషన్ తెలిపింది.
దీని ప్రకారం ఆయా ప్రాంతాల్లోని స్థానికులు,ప్రజాప్ర్తతినిధులు,అభ్యర్థుల నుండి అభ్యంతరాలను ప్రభుత్వం స్వీకరించనుంది. ఈ రెండు డివిజన్లతో రాష్ట్రంలో రెవిన్యూ డివిజన్లు డెబ్బై నాలుగుకు చేరనున్నాయి..