ఏపీకి మూడు రాజధానులు ఉంటాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం ఇటీవల అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన సంగతి విదితమే. ఈ అంశంపై ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ గత యాబై రోజులుగా పలు విధాలుగా నిరసనలు వ్యక్తం చేస్తుంది.
ఈ క్రమంలో తాజాగా ఈ రోజు మంగళవారం పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇందులో భాగంగా టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సహయ మంత్రి నిత్యానంద రాయ్ స్పందిస్తూ” ఏపీకి మూడు రాజధానులు ఉండాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అని తెలిసింది.
అయితే రాజధానులు ఏర్పాటు కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి రాదు. అది రాష్ట్రాల పరిధిలోనిది మాత్రమే. రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన వాటిని మాత్రమే కేంద్రం నోటిఫై చేస్తుంది అని తెలిపారు.