టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పినపాక ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ రేగా కాంతారావు సతీమణి సుధారాణి గారు మొక్కలు నాటారు . వారితో పాటు కరకగూడెం ఎంపీపీ రేగా కాళిక గారు కూడా పాల్గొన్నారు.
కాంతారావు గారు ఎంపీ సంతోష్ గారి పిలుపు మేరకు పినపాక నియోజకవర్గాన్ని మొక్కలు నాటి , రాష్ట్రంలో ఆదర్శంగా ఉండాలని గ్రీన్ ఛాలెంజ్ లో పోటీలు నిర్వహించారు. వారిలో ఎక్కువ మొక్కలు నాటిన వారికి బహుమతులు ఇచ్చి వారిని సత్కరించారు. ఈ విదంగా పినపాక నియోజకవర్గంలో గ్రీన్ ఛాలెంజ్ చాలా అద్భుతంగా కొనసాగుతోంది.
చిన్న పిల్లలు సైతం నాటిన మొక్కలకి నీరు పోసి వాటి ఎదిగేందుకు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నియోజకవర్గంలో అందరూ కలిసికట్టు , ఒకరికొకరు అనుకోని రోజువారీగా మొక్కలు నాటి నియోజకవర్గ పరిధిలోని ప్రజలందరూ భాగస్వామ్యం కావడాన్ని ఎంపీ సంతోష్ కుమార్ గారు మెచ్చుకొన్నారు.